స్టాఫ్‌తో రకుల్ సెలబ్రేషన్స్

by  |
స్టాఫ్‌తో రకుల్ సెలబ్రేషన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఒక హీరోయిన్ సక్సెస్ కావాలంటే తన స్టాఫ్ సపోర్ట్ చాలా అవసరం. హెయిర్, మేకప్, డ్రెస్సింగ్ ప్రతీ ఒక్క విషయం గురించి వాళ్లే చూసుకుంటారు. ముఖ్యంగా తెరపై తను అందంగా కనబడుతున్నానంటే కారణం స్టాఫ్ అని చెప్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అందుకే ప్రస్తుతం హిందీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న రకుల్ వారితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. కరోనా టైమ్ లో తనకు సహకరించి, సక్సెస్‌ఫుల్‌గా సినిమా కంప్లీట్ అయ్యేందుకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెప్తూ కేక్ కట్ చేసింది.

తన మోస్ట్ హార్డ్ వర్క్, ఫన్ అండ్ క్రాక్ టీమ్ వల్లే ఇదంతా సాధ్యమైందన్న రకుల్.. మేమందరం టెస్ట్ చేయించుకున్నామని, అందుకే మాస్క్ లేకుండా సెలబ్రేట్ చేసుకొని కేక్ షేర్ చేసుకున్నామని తెలిపింది. మీరు కూడా కరోనా బారిన పడకుండా ఉండేందుకు తప్పకుండా ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించాలని, సేఫ్‌గా, హ్యాపీగా ఉండాలని కోరింది.


Next Story

Most Viewed