మళ్లీ ప్రేమలోపడ్డ రాఖీ సావంత్..

by  |
మళ్లీ ప్రేమలోపడ్డ రాఖీ సావంత్..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్.. బిగ్ బాస్ హిందీ సీజన్ 14లో కంటెస్టెంట్‌గా ఇతర ఇంటి సభ్యులకు గట్టిపోటీ ఇస్తోంది. అయితే హౌజ్‌లో చాలాసార్లు ఎమోషనల్ అయిన రాఖీ.. ఫ్యామిలీతో మీటింగ్ ఎపిసోడ్‌లో తల్లితో వీడియో కాల్ మాట్లాడింది. ఆ సమయంలో భర్త గురించి బాధపడుతూ.. ఒక్కసారైనా ప్రపంచానికి కనిపించమని ప్రాధేయపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా భర్త అంటే సావంత్‌కు ఎంత అభిమానం, ప్రేమ అని పొగిడేశారు నెటిజన్లు. కానీ లేటెస్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్‌లో రాఖీ మాటలు షాక్ ఇవ్వగా.. నెటిజన్లు రాంగ్ అని ప్రూవ్ చేసింది.

హిందీ సీరియల్ నటులు, భార్యాభర్తలు..

రుబీనా డిలైక్, అభినవ్ శుక్లా కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇంటి సభ్యులు కాగా.. అభినవ్ శుక్లాతో ప్రేమలో పడిపోయానని ఎమోషనల్ అయింది రాఖీ. కన్ఫెషన్ రూములో బిగ్ బాస్‌తో మాట్లాడిన హాట్ బాంబ్.. “తన మనసులో అభినవ్ మీద ఉన్న ప్రేమను మరిచిపోలేను” అని తెలిపింది. అంతే కాదు “అభినవ్ కళ్లలోనూ తన మీద ప్రేమను చూశానని.. అందుకోసం ఏదైనా చేసేస్తాను” అని ఏడ్చేసి ఫాలోవర్స్‌కు షాక్ ఇచ్చింది.

మరి రాఖీ సావంత్ చేసిన ఈ ఆరోపణల మీద అభినవ్ వైఫ్ రుబీనా ఎలా స్పందిస్తుందో? హౌజ్‌లో ఎలాంటి వాతావరణం నెలకొంటుందో? అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇది స్క్రిప్టింగా లేక నిజమా? అనేది పక్కన పెడితే బిగ్ బాస్ కాపురాలు కూల్చేలా ఉంది కదా! అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి పిచ్చి డ్రామాలతో ప్రేక్షకులను తప్పుదారి పట్టించేలా ఉన్న బిగ్ బాస్ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed