అవి కనిపించకూడదని కర్టెన్ చుట్టుకొని ఆడిషన్‌కు వెళ్లా : ఐటెం బాంబ్

by  |
అవి కనిపించకూడదని కర్టెన్ చుట్టుకొని ఆడిషన్‌కు వెళ్లా : ఐటెం బాంబ్
X

దిశ, సినిమా : బీటౌన్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సెలబ్రిటీస్‌లో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఒకరు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన భామ.. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కష్టపడింది. కాగా ఇటీవలే జీ కామెడీ షోకు హాజరైన ఈ సెక్సీ స్టార్.. బిగినింగ్ డేస్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్లను వివరించింది. అంతేకాదు తనకు అవకాశమిచ్చి జీవితాన్ని మార్చిన డైరెక్టర్ ఫరాఖాన్‌కు థాంక్స్ చెప్పింది. ఆడిషన్స్ కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్నని.. ఆ టైమ్‌లో నిరాశపడకుండా ఉండేందుకు తన తల్లి మోటివేట్ చేస్తుండేదని చెప్పింది. ఈ క్రమంలో స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండేందుకు డైలీ ఒక కప్పు దాల్ మాత్రమే తీసుకునేదాన్నని తెలిపిన రాఖీ.. ఫైనల్‌గా ఒకరోజు షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఆఫీస్ నుంచి ఫరాఖాన్ ఆడిషన్‌కు పిలవడంతో జీవితం మలుపుతిరిగిందని వెల్లడించింది.

మొదటిసారి షారుఖ్‌తో ‘మై హూనా’ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్న హాట్ లేడీ.. క్యారెక్టర్ ప్రకారం గ్లామరస్‌గా కనిపించాల్సి వచ్చిందట. అయితే తనుండే ప్లేస్‌లో అలాంటి బట్టలు వేసుకుని బయటకు రావడం కష్టమవడంతో.. తల్లి సలహా మేరకు తన సెక్సీ లుక్ కనిపించకుండా కర్టెన్ క్లాత్‌ను చుట్టుకొని ఆడిషన్‌కు వెళ్లినట్లు వెల్లడించింది. మొత్తానికి అక్కడ తన గ్లామరస్ లుక్ చూసి ఫరాఖాన్ ఆశ్చర్యపోయిందని ఆ ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకుంది. రాఖీ ప్రస్తుతం కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.


Next Story

Most Viewed