- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉక్కు ఉద్యమానికి రాకేశ్ టికాయత్ మద్దతు
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తాజాగా విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ మద్దతు ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలోని 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తాజాగా విశాఖ ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ మద్దతు ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
దేశంలోని 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సరికాదని టికాయత్ తెలిపారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి టికాయత్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






