రైతుల పోరాటాన్ని అలా చూడటం లేదు: రాకేశ్ టికాయత్

by  |
రైతుల పోరాటాన్ని అలా చూడటం లేదు: రాకేశ్ టికాయత్
X

న్యూఢిల్లీ : నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారత్ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తప్పుబట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల ఉద్యమాన్ని గతేడాది షాహీన్‌బాగ్ పోరాటం మాదిరిగా సీరియస్‌గా బావించడం లేదని అన్నారు. హర్యానాలోని యమునానగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టికాయత్ మాట్లాడుతూ.. ‘కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేసేదాకా రైతులు ఢిల్లీని వీడరు. వాళ్లు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పోరాటం చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ ఉద్యమాన్ని గతేడాది షాహీన్‌బాగ్‌లో నిర్వహించిన పోరాటంగా బావించడం లేదు. అయినా మా పొరును మాత్రం ఆపబోం. అవసరమైతే 2023 దాకానైనా పోరాటం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం..’ అని ఆయన చెప్పారు. 2019 లో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను నిరసిస్తూ షాహీన్‌బాగ్ లో ముస్లిం మహిళలు పోరాటం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం షాహీన్‌బాగ్ పోరాట వేదికను ఖాళీ చేయించింది.

రైతులపై వాటర్ కెనాన్లు..

రైతులపై వాటర్ కెనాన్ల (నీటి ఫిరంగులు) ను ప్రయోగించారు హర్యానా పోలీసులు. సిస్రాలో స్థానిక బీజేపీ ఎంపీ సునీత దుగ్గల్, హర్యానా లోక్హిత్ పార్టీ ఎంఎల్ఎ గోపాల్ ఖండ లకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు.. రైతులను చెదరగొట్టి వారిపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు.


Next Story

Most Viewed