- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైవీ సుబ్బారెడ్డికి రాకేశ్ సిన్హా లేఖ
<p>దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ బోర్డు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన… 63 నిరర్థక ఆస్తులను టీటీడీ వేలం వేయాలని భావించినట్టు తెలిసిందని, ఆ ఆస్తుల వల్ల టీటీడీకి ఎలాంటి ఆదాయమూ రావడం లేదని, దీంతో వాటి విక్రయానికి పూనుకున్నట్టు తెలుస్తోందని ఆయన లేఖలో తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని టీడీపీ ప్రభుత్వ సమయంలోనే తీసుకున్నట్టు తెలిసిందని కూడా పేర్కొన్నారు. అయితే తిరుమల బాలాజీకి […]</p>

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ బోర్డు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన… 63 నిరర్థక ఆస్తులను టీటీడీ వేలం వేయాలని భావించినట్టు తెలిసిందని, ఆ ఆస్తుల వల్ల టీటీడీకి ఎలాంటి ఆదాయమూ రావడం లేదని, దీంతో వాటి విక్రయానికి పూనుకున్నట్టు తెలుస్తోందని ఆయన లేఖలో తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని టీడీపీ ప్రభుత్వ సమయంలోనే తీసుకున్నట్టు తెలిసిందని కూడా పేర్కొన్నారు.
అయితే తిరుమల బాలాజీకి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని, శ్రీవారికి భక్తులు రకరకాలుగా కానుకలు ఇస్తుంటారని, ఎంతో భక్తితో సమర్పించుకున్న ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా విక్రయించడం సరికాదని చెప్పారు. వాటి నిర్వహణ టీటీడీకి సమస్యగా మారితే భక్తులకు అప్పగిస్తే వాటిని వారు పరిరక్షించుకుంటారని ఆయన లేఖలో సూచించారు. దీనిపై మరింత లోతుగా ఆలోచించాలి, ఆస్తుల విక్రయం నిలిపేయాలని ఆయన లేఖలో కోరారు.






