భారీ ఆదాయం సాధించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

by  |
భారీ ఆదాయం సాధించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధర రికార్డు స్థాయికి ఎగబాకిన తరువాత టైటాన్ షేర్లు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. టైటన్ షేర్లలో పెట్టుబడులతో దేశీయ దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు మరోసారి మార్కెట్ వ్యూహం ఫలించింది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత సంవత్సరం మార్చి నుంచి రూ. 1500 కోట్లకు పైగా ఆర్జించారు.

బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడంతో టైటాన్ షేర్లు సోమవారం ఏకంగా 4 శాతానికిపైగా పెరిగి రూ. 1,089కి చేరింది. మార్చి ఈ షేర్ ధర రూ. 720 కనిష్ట ధర నుంచి 50 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో టైటన్ షేర్ ఇప్పటివరకు 9 శాతం వరకూ క్షీణించగా, గత నెలలో 8 శాతం పెరగడం గమనార్హం. అంతేకాకుండా, ఒక్కో షేర్‌కు రూ. 4 డివిడెండ్ ప్రకటించడంతో..జూన్ త్రైమాసికం నాటికి రాకేశ్, ఆయన భార్య 5.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. టైటన్ షేర్ విలువ మార్చిలో కనిష్ట స్థాయిలో ఉన్న సమయంలో రూ. 3,258 కోట్లు ఉండగా, గత వారం నాటికి ఈ విలువ రూ. 5,112 కోట్లకు చేరింది. దీంతో మార్చి నుంచి ఇప్పటివరకు రూ. 1,584 కోట్ల వృద్ధిని సాధించింది.


Next Story

Most Viewed