విషాదం: చిట్‌ఫండ్ ఏజెంట్ల పెట్రోల్ దాడిలో గాయ‌ప‌డిన రాజు మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-08 07:01:01  IST  )

<p>దిశ ప్రతినిధి, వర‌ంగ‌ల్ : అచ‌ల చిట్‌ఫండ్ ఏజెంట్ దంప‌తుల పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితుడు రాజు, హ‌న్మకొండ‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం క‌న్నుమూశాడు. ఐదు రోజులుగా ప్రాణాలతో పోరాడిన రాజు మ‌ర‌ణించ‌డంతో భార్య మాన‌స‌తో పాటు బంధువులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. చిన్ననాటి స్నేహితుడు గ‌ణేష్‌, అత‌ని భార్య కావ్య స‌ల‌హా మేర‌కు కొద్ది నెల‌ల క్రితం వరంగల్ అచల చిట్‌ఫండ్ లో రాజు చీటీ వేశాడు. ఏజెంట్లుగా ప‌నిచేస్తున్న గ‌ణేష్‌, కావ్యల‌పై [&hellip;]</p>

విషాదం: చిట్‌ఫండ్ ఏజెంట్ల పెట్రోల్ దాడిలో గాయ‌ప‌డిన రాజు మృతి
X

దిశ ప్రతినిధి, వర‌ంగ‌ల్ : అచ‌ల చిట్‌ఫండ్ ఏజెంట్ దంప‌తుల పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితుడు రాజు, హ‌న్మకొండ‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం క‌న్నుమూశాడు. ఐదు రోజులుగా ప్రాణాలతో పోరాడిన రాజు మ‌ర‌ణించ‌డంతో భార్య మాన‌స‌తో పాటు బంధువులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. చిన్ననాటి స్నేహితుడు గ‌ణేష్‌, అత‌ని భార్య కావ్య స‌ల‌హా మేర‌కు కొద్ది నెల‌ల క్రితం వరంగల్ అచల చిట్‌ఫండ్ లో రాజు చీటీ వేశాడు. ఏజెంట్లుగా ప‌నిచేస్తున్న గ‌ణేష్‌, కావ్యల‌పై న‌మ్మకంతోనే రాజు చీటీలో స‌భ్యుడిగా చేరాడు.

అయితే చీటీ ఎత్తుకున్నప్పటికీ సంస్థ నుంచి డ‌బ్బులు రాక‌పోవ‌డంతో గ‌ణేష్‌, కావ్యల‌తో రాజు, మాన‌స దంప‌తులకు గొడ‌వ జ‌రుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీనిని మససులో పెట్టుకొన్న గ‌ణేష్ దంప‌తులు రాజుపై ప‌గ పెంచుకున్నారు. హ‌న్మకొండ‌లోని డీసీసీ భ‌వ‌న్ ఎదురుగా త‌న షాపులో ఉన్న రాజు, మాన‌స‌ల వ‌ద్దకు చేరుకున్న గ‌ణేష్ దంపతులు పెట్రోల్ గుప్పించారు. పెట్రోల్ గుప్పిస్తున్నప్పుడు మాన‌స త‌ప్పించుకోగా రాజుకు మాత్రం కావ్య నిప్పు పెట్టింది. రెండు రోజుల క్రితం నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 50శాతం గాయాల‌తో నాలుగురోజులుగా హ‌న్మకొండ‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు బుధ‌వారం తుదిశ్వాస విడిచాడు.

సమంత-నాగచైతన్య డైవర్స్.. హింట్ ఇచ్చిన నాగ్?

Next Story