ఛలాంగ్' స్టార్స్ 'డీడీఎల్‌జే' రీక్రియేషన్

by  |
ఛలాంగ్ స్టార్స్ డీడీఎల్‌జే రీక్రియేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: షారుఖ్ ఖాన్, కాజోల్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా చూశాక బాలీవుడ్‌తో ప్రేమలో పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అమెరికా అధ్యక్షులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన వారే. అలాంటి క్లాసిక్ మూవీతో మన సినీ ప్రియులకు ఎలాంటి అనుబంధం ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ ప్రేమను రుజువు చేసుకునేందుకు ‘ఛలాంగ్’ స్టార్స్ రాజ్ కుమార్ రావు, నుష్రత్ భరుచ డీడీఎల్‌జే సాంగ్, సీన్ రీక్రియేట్ చేశారు. రాజ్, సిమ్రన్ ఐకానిక్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ.. పూల తోటలో .. ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ సాంగ్‌పై డ్యాన్స్ చేశారు. హీరో హీరోయిన్లు విడిపోయిన తర్వాత మళ్లీ కలుసుకునే సన్నివేశాన్ని పున:సృష్టించేందుకు ప్రయత్నించారు. కాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. డీడీఎల్‌జే లవర్స్‌ ఈ వీడియోతో లవ్‌లో పడిపోక తప్పరు. సెలబ్రిటీలు సైతం రాజ్ కుమార్, నుష్రత్‌ల వీడియోపై కాంప్లిమెంట్స్ అందించారు.

కాగా హన్సల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ‘ఛలాంగ్’ నవంబర్ 13న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ అందుకుంది. లవ్ రంజన్, అజయ్ దేవగన్, అంకుర్ గర్గ్, భూషణ్ కుమార్ నిర్మించిన చిత్రంలో మొహ్మద్ జీషన్ ఆయుబ్, సౌరభ్ శుక్లా, ఐలా అరుణ్, సతీశ్ కౌశిక్ ప్రధానపాత్రల్లో కనిపించారు. యో యో హనీసింగ్ అందించిన ‘కేర్ ని కర్దా’ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.

Next Story

Most Viewed