సినీ కార్మికులకు అండగా రజినీ, సూర్య బ్రదర్స్

by  |
సినీ కార్మికులకు అండగా రజినీ, సూర్య బ్రదర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం దైనందిన జీవితాల్లో అలజడి సృష్టిస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులను చిద్రం చేస్తోంది. కనీసం తిండి గింజలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి ఏర్పడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళ సినీ ఇండస్ట్రీలో వేలాది మంది సినీ కార్మికులు సినిమా షూటింగ్‌లు వాయిదాపడడంతో పనిలేక పస్తులుంటున్నారు. ఈ విషయాన్నే వెల్లడించారు దక్షిణ భారత చలన చిత్ర సమ్మేళనం అధ్యక్షులు, దర్శకులు ఆర్.కె.సెల్వమణి. సినీ కార్మికులంతా తిండిలేక విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రోజూవారి కూలీల మీద ఆధారపడి బ్రతికే వారు … సహాయం కోసం అర్ధిస్తున్నారని తెలిపారు. మరో 20 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని… సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, టెక్నిషియన్లు వారికి సహాయం అందించేందుకు ముందుకు రావాలని కోరాడు. ఒక్కొక్కరు ఒక్కో బియ్యం బస్తా అందించిన వారి ఆకలి తీరుందని …. అర్ధం చేసుకుని ఆదుకోవాలని అర్ధించాడు.

ఆర్.కె. సెల్వమణి పిలుపుకు స్పందించారు హీరో సూర్య, కార్తి బ్రదర్స్. తమిళనాట ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చే ఈ బ్రదర్స్… సినీ కార్మికులను ఆదుకునేందుకు రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు. మిగిలిన వారు కూడా తమకు తోచిన సాయం అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీ కాంత్ సినీ కార్మికుల జీవితాలను నిలబెట్టేందుకు ముందుకొచ్చారు. దక్షిణ భారత చలన చిత్ర సమ్మేళనం (FEFSI )కి రూ. 50 లక్షల విరాళాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నారు.

Tags: FEFSI, RK Selvamani, Surya, Karthi, Rajinikanth


Next Story

Most Viewed