లేటైనా.. టాప్ లేపుతానంటున్న తలైవా!

by  |
లేటైనా.. టాప్ లేపుతానంటున్న తలైవా!
X

సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఆ పేరుకున్న స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తలైవా స్టైల్, స్వాగ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తోందంటే.. పండగ చేసుకోవాల్సిందే. తెరపై కనిపించాడంటే విజిల్స్ పడాల్సిందే. దేశ, విదేశాల్లోనూ అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న రజినీ.. నెక్స్ట్ సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

తలైవా తరువాతి ప్రాజెక్ట్ ‘అన్నాత్తె’. శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఇది సాధ్యమయ్యేలా కనిపించడంలేదట. ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అయినా సరే.. ఆరోగ్యరీత్యా రజినీ పాల్గొనే అవకాశం లేదట. కనీసం రెండు నెలలైనా షూటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట రజినీ. ఈ నేపథ్యంలో 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న ‘అన్నాత్తె’ సినిమా పూర్తి కావాలంటే చాలా టైమ్ పట్టేలా ఉందట. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాను.. వేసవికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉందట సినిమా యూనిట్. కాగా ఈ సినిమాలో రజినీతో కలిసి మీనా, నయనతార, ఖుష్బూ సుందర్, కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.



Next Story

Most Viewed