రజినీ 168వ చిత్రం టైటిల్ ఇదే!

by  |
రజినీ 168వ చిత్రం టైటిల్ ఇదే!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ .. ‘దర్బార్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది రజినీకి 167వ సినిమా కాగా… 168వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కిస్తున్నాడు. సిరుతై శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ టైటిల్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది యూనిట్. ‘ అన్నాద్ధే’ గా సినిమా పేరును ప్రకటించిన టీం…. కమల్ హాసన్ క్లాసికల్ హిట్ అబూర్వ సోగోధరార్గల్ సినిమాలోని ‘అన్నాథ ఆదురార్’ పాట నుంచి సినిమా పేరును తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తుండగా డి. ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కీర్తి సురేష్, నయనతార, ఖుష్బు, సతీష్, సూరి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story

Most Viewed