సూపర్‌స్టార్ రజినీకి షాకిచ్చిన అనుచరులు..

by  |
సూపర్‌స్టార్ రజినీకి షాకిచ్చిన అనుచరులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాట తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఆయన అనుచరులు పెద్ద షాక్ ఇచ్చారు. రజినీ పార్టీ ప్రకటించిన అనంతరం నియమించబడిన ముగ్గురు జిల్లా సెక్రెటరీలు ఆదివారం DMK పార్టీలో చేరారు. ఆదివారం చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టబోనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

తొలుత తలైవా ‘మక్కల్ మండ్రమ్’ అనే పార్టీని స్థాపించినా కొన్ని ఆరోగ్య, అనివార్య కారణాల వలన రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మక్కల్ మండ్రమ్ పార్టీకి చెందిన తూతుకూడి, రామనాథపురం, తేని జిల్లాల సెక్రెటరీలు డీఎంకే పార్టీలో చేరినట్లు అందరూ అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed