ఆ ప్రొడ్యూసర్ పేరులో 88.. ఏంటా సీక్రెట్?

by  |
Kartikeya Raja Vikramarka
X

దిశ, సినిమా : యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టీ సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా నవంబర్ 12న రిలీజ్ కానుండగా.. దీపావళి కానుకగా సోమవారం ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి టి, నిర్మాత ‘88’ రామారెడ్డి మూవీ విశేషాలను తెలియజేశారు. దర్శకుడు శ్రీ సరిపల్లి పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడని.. టీజర్ స్టైలిష్ అండ్ రిచ్‌గా ఉండేందుకు అదే కారణమని తెలిపారు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారన్నారు. ప్రేమ, వినోదం సమపాళ్లలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కార్తికేయ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని, ఇది ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఇక ప్రొడ్యూసర్ రామారెడ్డిని తన పేరు ముందున్న ‘88’ వెనకున్న స్టోరీ గురించి అడిగితే.. నాలుగు సినిమాల తర్వాత చెబుతానంటూ దాటవేశారు.

Next Story

Most Viewed