‘ఆర్‌ఎక్స్ 100’ హీరో సరదా తీరిపోయిందంటా..!

by  |
‘ఆర్‌ఎక్స్ 100’ హీరో సరదా తీరిపోయిందంటా..!
X

దిశ, సినిమా : ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన కార్తికేయ.. కోలీవుడ్ స్టార్ అజిత్ ‘వాలిమై’లోనూ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే, తెలుగులో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానుండగా.. తాజాగా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించగా.. డ్యూటీలో చేరిన కొత్తలో ఉత్సాహంగా పనిచేసినా, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను వేరే విధంగా చూపించారు.

ఈ క్రమంలోనే ‘చిన్నప్పుడు కృష్ణ గారి, పెద్దయ్యాక టామ్ క్రూజ్ సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయ్యాను గానీ ఇప్పుడు సరదా తీరిపోతోంది’ అని చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొత్తానికి ఈ చిత్రాన్ని కామెడీ, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా తాన్య రవిచంద్రన్ నటిస్తుండగా.. తనికెళ్ల భరణి, సుధాకర్ కోమాకుల ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Next Story

Most Viewed