శిల్పకు ప్రేమతో… రాజ్!

by  |
శిల్పకు ప్రేమతో… రాజ్!
X

సోమవారం(మే 8న) బాలీవుడ్ చేపకళ్ల సుందరి శిల్పాశెట్టి పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు, సినీ స్టార్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తగా.. శిల్ప భర్త రాజ్ కుంద్రా అందరికంటే భిన్నంగా, ప్రేమతో విష్ చేశాడు. ‘నా జీవితానికి అర్థాన్నిచ్చిన దేవతవు నువ్వు’ అంటూ శిల్పాకు లవ్ యూ చెప్పిన రాజ్.. ఏ అద్భుత కథ కూడా మన ప్రేమకథతో సరితూగదన్నాడు. ‘నా ప్రియమైన సతీమణి.. నీ ప్రేమతో నాలో ఉన్న లోపాలను పరిపూర్ణంగా మార్చావు. నీ చిరునవ్వు చీకటి రోజులను సైతం వెలిగించి, విలువైనవిగా మారుస్తుంది. నువ్వు నా పిల్లలకు తల్లి మాత్రమే కాదు.. నా జీవితానికి, నా హృదయానికి రాణివి’ అంటూ ఈ సందర్భంగా తన ప్రేమను తెలిపాడు. పదాలకు కూడా అందనంత ప్రేమ నీపై ఉంది.. ‘హ్యాపీ బర్త్ డే మై జాన్..’ అని శిల్పాకు చాలా చాలా స్పెషల్‌గా విష్ చేశాడు రాజ్ కుంద్రా.

కాగా శిల్ప.. 2009లో బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వీరికి ఏడేళ్ల కొడుకు వియాన్ ఉండగా.. ఈ మధ్యే సరోగసి ద్వారా కూతురికి వెల్‌కమ్ చెప్పారు. తనకు ‘సమీషా’ అని పేరు పెట్టిన శిల్పా దంపతులు.. ఇంకా బేబీని ప్రపంచానికి పరిచయం చేయనేలేదు.

Next Story

Most Viewed