- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలకు మూడు రోజులు తిప్పలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, 11వ తేదీ సాయంత్రంలోపు ఏపీ తీరాన్ని ఆనుకుని ఉన్న […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, 11వ తేదీ సాయంత్రంలోపు ఏపీ తీరాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story






