నేడు, రేపు పలుచోట్ల వర్షాలు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-24 23:52:30  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా శుక్రవారం రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని వారు పేర్కొన్నారు. ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు [&hellip;]</p>

నేడు, రేపు పలుచోట్ల వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అదేవిధంగా శుక్రవారం రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని వారు పేర్కొన్నారు. ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురిశాయని వారు పేర్కొన్నారు.

Next Story