ఇది సిద్ధిపేట జిల్లాలోనే.. ఎక్కడంటే..?

by Shyam |

<p>దిశ, దుబ్బాక: సిద్ధిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ వద్ద చెక్ డ్యాం నిండి పొంగి ప్రవహిస్తోంది. ఇటీవల కాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు చిన్న చిన్న కుంటలు నిండి కూడవెళ్లి ఎగువ ప్రాంతంలో చందాపూర్ వద్ద నిర్మించిన చెక్ డ్యాం పొంగి ప్రవహిస్తోంది. ఈసారి వర్షాకాలం ఆరంభం నుంచే విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భారీ మొత్తంలో పంట పొలాలు సాగు చేస్తున్న రైతులకు ఆనంద దాయకం కానుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు కూడవెళ్లి వాగు [&hellip;]</p>

ఇది సిద్ధిపేట జిల్లాలోనే.. ఎక్కడంటే..?
X

దిశ, దుబ్బాక: సిద్ధిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ వద్ద చెక్ డ్యాం నిండి పొంగి ప్రవహిస్తోంది. ఇటీవల కాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు చిన్న చిన్న కుంటలు నిండి కూడవెళ్లి ఎగువ ప్రాంతంలో చందాపూర్ వద్ద నిర్మించిన చెక్ డ్యాం పొంగి ప్రవహిస్తోంది. ఈసారి వర్షాకాలం ఆరంభం నుంచే విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భారీ మొత్తంలో పంట పొలాలు సాగు చేస్తున్న రైతులకు ఆనంద దాయకం కానుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు కూడవెళ్లి వాగు ఎగువ ప్రాంతమైన తొగుట పరిసర ప్రాంతాల్లోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ పర్వాలేదు అంటున్నారు రైతులు. చెరువులు, కుంటలు నిండితే ఈసారి పోయినా.. వచ్చే సారైనా పండించుకోవచ్చంటున్నారు. ఇంకా ఇలాగే రెండు మూడు రోజులు వర్షాలు పడితే మాత్రం పత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పవచ్చు.

Next Story