సెల్లార్‌లో పడి బాలుడు మృతి

14

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది‌. దిల్ సుఖ్ నగర్‌లోని అపార్ట్ మెంట్‌లో ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లో వెళ్తే….నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిల్‌సుక్ నగర్‌లోని సాహితీ అపార్ట్ మెంట్ లోని సెల్లార్‌లోకి వాన నీరు చేరింది. కాగా ఆ నీటిలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం అధికారులు సెల్లార్‌లోని నీటిని మోటర్లతో తోడేసీ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.