పండుగ సీజన్‌లో అదనంగా 392 ట్రైన్లు..

by  |
పండుగ సీజన్‌లో అదనంగా 392 ట్రైన్లు..
X

న్యూఢిల్లీ :

పండుగ సీజన్‌లో అదనంగా 392 ట్రైన్లు (లేదా 196 జతలు) నడపనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న 300కుపైగా ట్రైన్‌లకు అదనంగా వీటిని నడపనున్నట్టు వివరించింది. పండుగ సీజన్‌లో రద్దీ పెరిగే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్‌ల సేవలను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. వీటికి స్పెషల్ ట్రైన్ టికెట్ చార్జీలే ఉంటాయని పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అదనంగా 24 ట్రైన్‌ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. దుర్గా పూజ, దసరా, దీపావళి, ఛత్త పూజ వేడుకలతో సాధారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగుతుంది.

కానీ, కరోనా కారణంగా ట్రైన్ సేవలను నిలిపేసిన రైల్వే క్రమంగా కొన్ని మార్గాల్లో సేవలను అందించే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం సుమారు 300లకు పైగా ట్రైన్‌లు రెగ్యులర్‌గా సేవలందిస్తున్నాయి.


Next Story