- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. టికెట్లపై భారీ డిస్కౌంట్స్
<p>న్యూఢిల్లీ: ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. యూపీఐ, భీమ్ ఇంటర్ ఫేస్‌ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ ఇచ్చే పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 12వరకు ప్రయాణీకులకు వర్తిస్తుందని తెలిపింది. కాగా ఈ ఇంటర్ ఫేస్‌ల ద్వారా కౌంటర్ల వద్ద టికెట్ బుక్ చేసుకునే వారికే ఈ పథకం వర్తిస్తుందని రైల్వే తెలిపింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి ఈ స్కీమ్ […]</p>

న్యూఢిల్లీ: ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. యూపీఐ, భీమ్ ఇంటర్ ఫేస్‌ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ ఇచ్చే పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 12వరకు ప్రయాణీకులకు వర్తిస్తుందని తెలిపింది. కాగా ఈ ఇంటర్ ఫేస్‌ల ద్వారా కౌంటర్ల వద్ద టికెట్ బుక్ చేసుకునే వారికే ఈ పథకం వర్తిస్తుందని రైల్వే తెలిపింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి ఈ స్కీమ్ వర్తించదని వెల్లడించింది.
2017 డిసెంబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ, భీమ్ ఇంటర్ ఫేస్‌ల ద్వారా చెల్లింపులను భారత రైల్వే అంగీకరిస్తోంది. అప్పటి నుంచి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్) కౌంటర్ల వద్ద బుక్ చేసుకునే టికెట్ల ప్రాథమిక చార్జీల మొత్తంపై 5 శాతం డిస్కౌంట్(గరిష్టంగా 50 రూపాయల వరకు) డిస్కౌంట్‌ను రైల్వే అందిస్తోంది. అయితే ప్రయాణీకులు బుక్ చేసుకునే టికెట్ ప్రాథమిక చార్జీల మొత్తం కనీసం రూ.100 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలనే నిబంధన ఉంది.






