- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ సమర్థుడు: భుపేశ్ భాగేల్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భుపేశ్ భాగేల్ రాహుల్ గాంధీ అందుకు సమర్థుడని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలందరితో టచ్‌లో ఉండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమూ, అందరిలోనూ విశ్వాసాన్ని నింపే వీలు కేవలం ఆయనకే ఉందని తెలిపారు. ప్రధానమైన అంశాల్లో స్థిరంగా నిలబడి కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీనే పోరాడుతున్నారని, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని చెప్పారు. రాహుల్ సారథ్యంలో పార్టీ వర్కర్లు విశ్వాసాన్ని పొందుతారని, తద్వారా […]</p>

X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భుపేశ్ భాగేల్ రాహుల్ గాంధీ అందుకు సమర్థుడని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలందరితో టచ్‌లో ఉండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమూ, అందరిలోనూ విశ్వాసాన్ని నింపే వీలు కేవలం ఆయనకే ఉందని తెలిపారు.
ప్రధానమైన అంశాల్లో స్థిరంగా నిలబడి కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీనే పోరాడుతున్నారని, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని చెప్పారు. రాహుల్ సారథ్యంలో పార్టీ వర్కర్లు విశ్వాసాన్ని పొందుతారని, తద్వారా పార్టీని బలోపేతం చేయగలరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోవాలని ఇటీవలే ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
Next Story






