- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నాటి నర్సును హత్తుకున్న రాహుల్ గాంధీ.. (వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల తన నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో రెండు రోజులు పర్యటించారు. ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 1970 జూన్ 19న రాహుల్ జన్మించారు. అయితే ఆ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన రాజమ్మనే రాహుల్‌ను మొదటగా చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యి వయనాడ్‌లో ఉంటున్న రాజమ్మ.. రాహుల్ వయనాడ్ వచ్చిన విషయం తెలుసుకొని కలిసేందుకు వచ్చారు. అప్పటికే కారు ఎక్కి తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న రాహుల్ ఆమెను […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల తన నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో రెండు రోజులు పర్యటించారు. ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 1970 జూన్ 19న రాహుల్ జన్మించారు. అయితే ఆ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన రాజమ్మనే రాహుల్‌ను మొదటగా చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యి వయనాడ్‌లో ఉంటున్న రాజమ్మ.. రాహుల్ వయనాడ్ వచ్చిన విషయం తెలుసుకొని కలిసేందుకు వచ్చారు. అప్పటికే కారు ఎక్కి తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న రాహుల్ ఆమెను చూసి ఆమెతో ముచ్చటించారు.
రాజమ్మ తన కొడుకును రాహుల్ కు పరిచయం చేస్తూ.. రాహుల్ గాంధీ కూడా నా కొడుకులాంటి వాడే అంటూ సంబరపడ్డారు. అంతేకాకుండా సోనియాగాంధీ గురించి అడిగి తెలుసుకున్న రాజమ్మ.. ‘నేను మా ఇంటి నుంచి మీకు ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీకు అంత సమయం లేదు, నాకు అర్థమైంది. ఒకవేళ ఇబ్బంది పెడితే క్షమించాలి’ అని అన్నారు. దీంతో వెంటనే అలాంటిదేం లేదంటూ ఆమెను అప్యాయంగా హత్తుకున్నారు రాహుల్. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ కేరళ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
The wholesome love and affection from Rajamma Amma who was a nurse at Delhi’s holy family hospital where
Shri @RahulGandhi was born. pic.twitter.com/fMCDNIsUio— Congress Kerala (@INCKerala) August 17, 2021






