బ్యాట్‎తో కార్లపై దాడి చేసిన రాహుల్ ద్రవిడ్.. అసలు ఏమైంది..!

by  |
బ్యాట్‎తో కార్లపై దాడి చేసిన రాహుల్ ద్రవిడ్.. అసలు ఏమైంది..!
X

దిశ, వెబ్‎డెస్క్: భారతజట్టులో మిస్టర్ కూల్‎గా పేరుతెచ్చుకున్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‎కు కోపం వచ్చింది. అంతే కాదండోయ్.. ట్రాఫిక్‎లో కోపంతో ఉగిపోతూ పక్కన ఉన్న కారుపై బ్యాట్‎తో దాడి చేశాడు. ఏంటి నిజంగా రాహుల్ కోపంతో ఇంతపని చేశాడా… అనుకుంటారన్నా… కోపంతో కారు అద్దాలను పగులగొట్టిన విషయం వాస్తవమే గానీ..రియల్ లైఫ్‌‎లో కాదండీ.. రీల్ లైఫ్ లో..

క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించే ఒక యాప్ కోసం రూపొందించిన ప్రకటనలో రాహుల్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు వైరల్‎గా మారింది. ట్రాఫిక్‎లో ఇరుక్కున్న ద్రవిడ్, కోపంగా బ్యాట్‌తో కార్లపై దాడి చేస్తూ, ఇతరులతో వాదిస్తూ, చిరాకు పడుతున్నట్టు వీడియోలో ఉంది. అంతేకాదు ‘నేను ఇందిరా నగర్ రౌడీని’ అంటూ అరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “రాహుల్ భాయ్‎లో ఈ యాంగిల్ చూడలేదు” అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed