కెమెరా ముందుకు దర్శకేంద్రుడు.. విషెస్ తెలిపిన పవర్‌స్టార్

by  |
కెమెరా ముందుకు దర్శకేంద్రుడు.. విషెస్ తెలిపిన పవర్‌స్టార్
X

దిశ, సినిమా : నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి, ఎందరో నటులకు ఓనమాలు నేర్పిన దర్శక దిగ్గజం కే రాఘవేంద్ర రావు ఇప్పుడు కొత్త పాత్రలో మెరవనున్నారు. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్‌‌ తారాగణంగా దర్శకేంద్రుడు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ మూవీ చేసిన మ్యాజిక్ గురించి తెలిసిందే. తాజాగా ఆయన పర్యవేక్షణలోనే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రాఘవేంద్ర రావు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ‘ఇన్నాళ్లు కెమెరా వెనకుండి స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అన్న మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. దర్శకుడిగా మీకున్న అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్’గా అనేక విజయాలను సొంతం చేసుకున్న మీరు, ఈ కొత్త ప్రయాణంలో నటుడిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్’ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.



Next Story

Most Viewed