వరంగల్‌లో ర్యాగింగ్ కలకలం.. స్టూడెంట్ బట్టలు విప్పించి నగ్నంగా..!

736

దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లాలో ర్యాగింగ్ భూతం మరోసారి కలకలం సృష్టించింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ముగ్గురు ర్యాగింగ్ చేశారు. బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టించినట్టు తెలుస్తోంది. అయితే, బాధిత విద్యార్థి యూపీలో ఓ పొలిటికల్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇంట్లో వాళ్ళకు ఈ విషయం చెప్పాడు. వాళ్లు నేరుగా రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ర్యాగింగ్ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులతో బాధితుడికి క్షమాపణ చెప్పించడంతో వివాదం కాస్త సర్దుమణిగినట్టు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..