సేతుపతికి రాధిక సపోర్ట్..

19

దిశ, వెబ్ డెస్క్: విజయ్ సేతుపతి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరమీదకి వచ్చినప్పటి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న సేతుపతి‌కి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ టైం సపోర్ట్ ఇస్తూ ట్వీట్ చేశారు రాధిక శరత్ కుమార్.

సినిమాను సినిమాలాగే చూడాలి తప్ప..రాజకీయాలు యాడ్ చేసి రచ్చ.చేయకూడదని సూచించింది. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేస్తున్న సేతుపతి ఒక నటుడు అని..అలాంటప్పుడు తనపై ఎందుకు పనిలేని వారంతా కామెంట్స్ చేస్తున్నారని మండిపడింది. ఒక శ్రీలంక ఆటగాడు సన్ రైజర్స్ టీమ్‌కు బౌలింగ్ హెడ్ కోచ్‌గా ఎందుకు ఉన్నాడో ముందుగా ప్రశ్నించమని సూచించింది. సన్ రైజర్స్, సన్ టీవీ సంస్థలు రాజకీయాలతో సంబంధం ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, పొలి‌టిక్స్‌ను డిఫరెంట్‌గా చూస్తుందని చెప్పింది. అలాగే అందరూ కూడా ఆలోచించాలని అన్నది రాధిక.

సన్ రైజర్స్ ను కేవలం ఉదాహరణగా చూపించేందుకు మాత్రమే చెప్పానని.. ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దని కోరింది.