మమ్మల్ని అవమానించిన వారిని వదిలిపెట్టం : నటి రాధిక

112
radika

దిశ, వెబ్‌డెస్క్ : అన్నాడీఎంకే కూటమిలో మమ్మల్ని అవమానించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని సినీనటీ రాధిక శరత్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్‌ఎంకే పార్టీ బలమెంతో త్వరలోనే అందరికీ తెలుస్తుందని.. ఈ సందర్భంగా అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలకు ఆమె సవాల్ విసిరారు. నేను, నా భర్త శరత్ కుమార్ ఎవరికీ భయపడబోమని.. అందరికీ సమాధానం చెప్పడానికే ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నట్లు చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండగా, వెల్లచేరీ లేదా ఊసిలం పట్టి నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి తాను పోటీచేస్తానని రాధిక స్పష్టంచేశారు. కాగా, గతంలో అన్నాడీఎంకే పార్టీతో పొత్తుపెట్టుకున్న శరత్‌కుమార్ ఈసారి నటుడు కమల్ హాసన్ కొత్తగా స్థాపించిన ‘మక్కల్ నిధి మయ్యమ్’ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..