అప్పుడు వద్దని.. ఇప్పుడు సెలెక్ట్ చేశాడు : రాధిక ఆప్టే

by  |
అప్పుడు వద్దని.. ఇప్పుడు సెలెక్ట్ చేశాడు : రాధిక ఆప్టే
X

హాట్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన ‘రాత్ అకేలి హై’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన సినిమాతో హనీ టెహ్రాన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇన్నాళ్లు కాస్టింగ్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన హనీ సినిమాను తెరకెక్కించిన విధానానికి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక.. హనీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.

గతంలో కాస్టింగ్ డైరెక్టర్‌గా ఉన్న హనీని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తనను సెలెక్ట్ చేయలేదని తెలిపింది. చాలాసార్లు ఆడిషన్ ఇచ్చానని.. కానీ హనీ మాత్రం క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకుంటేనే చాన్స్ ఇచ్చేవాడని చెప్పింది. కానీ ఇప్పుడు తనే వచ్చి ఈ సినిమాలో నటించాలని అడగడంతో ఏం ఆలోచించకుండా సైన్ చేసేశానని తెలిపింది. తనంటే అంత నమ్మకం ఉందని చెప్పింది రాధిక. స్క్రిప్ట్ కూడా చదవకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానన్న రాధిక.. హనీ ఆర్టిస్ట్‌లతో పని చేయించుకునే విధానం బాగుంటుందని తెలిపింది.

Next Story

Most Viewed