#GlobalPrabhasDay.. బర్త్ డే గిఫ్ట్ రెడీ అయిపోయింది!

by  |
#GlobalPrabhasDay.. బర్త్ డే గిఫ్ట్ రెడీ అయిపోయింది!
X

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అయిపోతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ నుంచి టీజర్ రిలీజ్‌కు రెడీ అయిపోయారు మేకర్స్. ‘విక్రమాదిత్య’గా కనిపించబోతున్న ప్రభాస్ గురించి తెలుసుకోవాలంటే 23 అక్టోబర్ వరకు వెయిట్ చేయాలన్న మేకర్స్.. ఆ రోజు ఉ.11గం.16 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సినిమా టీజర్ పూర్తిగా ఇంగ్లీష్‌లో ఉండనుండగా.. మల్టిపుల్ రీజినల్ లాంగ్వేజెస్‌లో సబ్ టైటిల్స్‌ అందుబాటులో ఉండనున్నట్లు వివరించారు. #GlobalPrabhasDay హ్యాష్‌టాగ్‌తో టీజర్ అనౌన్స్‌మెంట్ చేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. కాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.



Next Story