డార్లింగ్ ఫ్యాన్స్‌కి హాట్ అప్ డేట్.. రేపే విడుదల

by  |
Prabhas
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం మూవీ టీమ్ ఎంతగానో కష్టపడుతోంది. మేకర్స్ సైతం ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారీగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సౌత్ వెర్షన్, నార్త్ వెర్షన్ మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండెలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సౌత్‌లో కొన్ని రోజుల క్రితం రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ వచ్చి సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఇదే పాట హిందీలోనూ దుమ్ము దులిపేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో మ్యూజిక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. హిందీలో ఈ ఫస్ట్ సింగిల్ ‘ఆషికీ ఆగయీ’ అంటూ సాగనుంది. ప్రస్తుతం ప్రభాస్ హిందీ ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 1న రిలీజ్‌కు సిద్దమవుతోంది. అంతేకాకుండా సినిమా జనవరి 14న విడుదల కానుండగా ఈ పాటతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారని సమాచారం.

అల్లు అర్జున్ కోసం..తగ్గేదే లే అంటున్న ప్రభాస్

ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా.. అలా చేస్తే జీరో రిజల్ట్స్..


Next Story

Most Viewed