అల్లు అర్జున్ కోసం..తగ్గేదే లే అంటున్న ప్రభాస్

by  |
Pushpa
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వీరిద్దరికీ ఇది హ్యాట్రిక్ మూవీ కాగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ప్రెస్టీజియస్ మూవీ డిసెంబర్ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుండగా.. ఇందుకు సంబంధించిన పనులను మేకర్స్ శరవేగంతో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 6వ తేదీన ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్న మూవీ మేకర్స్.. 12న ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు ప్లాన్ చేశారు.

అంతేకాదు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డార్లింగ్ ప్రభాస్ రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభాస్‌కు ఇప్పటికే ఆహ్వానం అందినట్లు తెలుస్తుండగా.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే ఈవెంట్ వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉంటే ‘పుష్ప’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాను ఓ రేంజ్‌లో కూర్చోబెట్టగా.. ట్రైలర్‌తో ఆ క్రేజ్ తారాస్థాయికి చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

అడవి తల్లికి పాటిస్తున్న పవన్ కళ్యాణ్..



Next Story