- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ కాళ్లు మొక్కిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ (వీడియో)
<p>దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషరేట్లలో, బెటాలియన్లు, పోలీస్ స్టేషన్లలో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌లో అనూహ్యంగా జరిగిన ఓ సంఘటనపై నెట్టింట చర్చ నడుస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల కుటుంబాలను సీపీ […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషరేట్లలో, బెటాలియన్లు, పోలీస్ స్టేషన్లలో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌లో అనూహ్యంగా జరిగిన ఓ సంఘటనపై నెట్టింట చర్చ నడుస్తోంది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల కుటుంబాలను సీపీ మహేష్ భగవత్ ఒక్కొక్కరిని కలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళను సన్మానిస్తుండగా ఆమె కన్నీటిపర్యతం అయింది. ఆమెకు నూతన వస్త్రాలు అందజేసిన సీపీ ఆ మహిళ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సీపీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Next Story






