ఆయనతో పనిచేయడం నా కల : రాశి ఖన్నా

by  |
ఆయనతో పనిచేయడం నా కల : రాశి ఖన్నా
X

దిశ, సినిమా : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరి’ సినిమా విడుదల వాయిదా పడగా, చైతన్య ప్రస్తుతం ‘థాంక్యూ’ షూట్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఇటలీలోని మిలన్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, తాజాగా హీరోయిన్ రాశీఖన్నా షూట్‌లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా ‘థాంక్యూ’ సెట్ నుంచి ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసింది.

డైరెక్టర్ విక్రమ్, పీసీ శ్రీరామ్‌తో వర్క్ చేయడం తన కల అని పేర్కొన్న రాశి.. చైతన్యతో రెండోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉందని తెలిపింది. సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను టురిన్, మిలన్‌లో చిత్రీకరించినట్లు చెప్పింది. ఇక రాశి ఈ చిత్రంతో పాటు ‘తుగ్లక్ దర్బార్, అరన్మనై3, మేధావి, బ్రహ్మం’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వస్తున్న సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. ఇందులో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీ రోల్స్ ప్లే చేయనున్నారు.



Next Story

Most Viewed