షాహిద్‌తో కలిసి రచ్చ చేసిన రాశి.. సేతుపతి?

by  |
షాహిద్‌తో కలిసి రచ్చ చేసిన రాశి.. సేతుపతి?
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ రాశీ ఖన్నా డిజిటల్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లో షాహిద్ కపూర్‌ హీరో కాగా.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా పాకిస్థానీ యూట్యూబ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ‘పావ్రీ హో రీ హై’ని యశ్‌రాజ్ ముఖతే రీమిక్స్ చేయగా.. ఈ సాంగ్‌పై యూనిట్ సభ్యులతో కలిసి ఓ ఫన్ వీడియో రిలీజ్ చేశారు షాహిద్. దర్శకులు, హీరోహీరోయిన్లతో పాటు కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ కూడా ఈ వీడియోలో జాయిన్ కాగా.. లాస్ట్ డే సూపర్‌గా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ సిరీస్‌లో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడన్న న్యూస్ స్ప్రెడ్ కాగా.. సేతుపతి ఎప్పటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed