రైతుల కోసం వస్తున్న ‘రైతన్న’.. నా లైఫ్‌లో ప్ర‌మోషన్ ఇదే ఫస్ట్ టైం : ఆర్ నారాయణ మూర్తి

36

దిశ, భద్రాచలం టౌన్ : రైతు వ్యతిరేక చట్టాల వలన దేశానికి ప్రమాదం పొంచి ఉందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. బుధవారం ఆయన భద్రాచలం విచ్చేసి సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పంటలు పండించిన రైతులకు ఈ దేశంలో గుర్తింపు లేకపోవడం అన్యాయమని అన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాల మూలంగా రానున్న రోజుల్లో రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందన్నారు.ఈ చట్టాల వల్ల రైతుకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. రైతుకు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా, వారిపై జరిగే పోరాటాలు, ఉద్యమాలకు ఈతరం నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.‌

అన్నం పెట్టే రైతుకు అన్యాయం జరిగితే దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, రైతుకు అండగా నిలవాలన్నారు. రైతు సమస్యలపై తీసిన రైతన్న సినిమాను ప్రజలు ఆదరించాలని కోరారు. తన 30 ఏళ్ల సినీచరిత్రలో ఏ రోజు తన సినిమా చూడాలని తాను ప్రచారం చేయలేదని ఆయన అన్నారు. దేశంలో రైతుకు జరుగుతున్న అన్యాయం వల్ల దేశ ప్రజలపై భారం పడుతున్న వైనాన్ని తాను రైతన్న సినిమాలో చూపించానని చెప్పారు. అందుకే ఈ సినిమాను చూడాలని ప్రజలకు ఒక సందేశం ఇచ్చేందుకు భద్రాచలం వచ్చానని ఆయన పేర్కొన్నారు.

రైతన్న సినిమా మీరు చూస్తే బాగా నచ్చుతుందని, నచ్చితేనే ఇతరులను చూడమని చెప్పాలని వివరించారు. ఈ నెల 22న భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాలలో రైతన్న సినిమాను థియేటర్లలో ఓపెన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతన్నకు మద్దతుగా, అండగా నిలబడాలనేది రైతన్న సినిమా ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతు కోసం పోరాటాలు,ఉద్యమాలు చేసే కమ్యూనిస్టులు ఆదర్శప్రాయులని ఆయన అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..