హీరో మాధవన్ డ్రగ్ అడిక్ట్.. ట్విట్టర్‌ ట్రోల్స్

by  |
హీరో మాధవన్ డ్రగ్ అడిక్ట్.. ట్విట్టర్‌ ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవర్ గ్రీన్ హీరో ఆర్. మాధవన్.. తనను డ్రగ్ అడిక్ట్ అని పిలిచిన వ్యక్తికి ఘాటు రిప్లై ఇచ్చాడు. మాదకద్రవ్యాలకు బానిసై కెరియర్‌ను నాశనం చేసుకున్నాడంటూ ట్వీట్ చేసిన ఓ ఎంబీబీఎస్ స్టూడెంట్‌కు తన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చాడు. ఒకప్పుడు మాధవన్‌ను తన గుండె చప్పుడు అని చెప్పుకున్న ఆ నెటిజన్.. ఆల్కహాల్, నార్కో డ్రగ్స్‌కు అలవాటుపడి తన బ్రిలియంట్ కెరియర్‌ను నాశనం చేసుకున్నాడన్నాడు. ‘రెహ్నా హై తేరె దిల్ మే’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంటర్ అయిన సమయంలో మ్యాడీ అప్పుడే వికసించిన పుష్పంలా ఉన్నాడని.. కానీ ఇప్పుడు తన ముఖం, కళ్లు చూస్తుంటే తను డ్రగ్ అడిక్ట్ అని పర్‌ఫెక్ట్‌గా అర్థమైపోతుందని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మ్యాడీ.. ‘ఓహ్.. ఇదా మీ నిర్ధారణ? పాపం మీ పేషెంట్స్‌ గురించి ఆలోచిస్తుంటే బాధేస్తుంది. నిజానికి డాక్టరైన మీకు కూడా డాక్టర్ అపాయింట్‌మెంట్ అవసరం’ అని రిప్లై ఇచ్చాడు. కాగా మ్యాడీకి తన ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దని, మీరు చాలా హ్యాండ్సమ్‌గా, హెల్తీగా కనిపిస్తున్నారని చెప్పారు.

ఇలాంటి ట్వీట్స్‌పై మాధవన్ గతంలోనూ స్పందించారు. కాగా మ్యాడీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ చూసిన మరో నెటిజన్.. మీ ఇంట్లో సిలువ ఉందని, మీరు క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యారా? అని ప్రశ్నించాడు. ఈ కామెంట్‌కు రిప్లై ఇస్తూ.. ‘మీలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది, నిజానికి నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నా. పిక్చర్‌లో సిలువ ఉందని చూసిన నువ్వు.. గోల్డెన్ టెంపుల్‌ను గుర్తించకపోవడం విచారకరం. సిక్కిజంలోకి కన్వర్ట్ అయ్యారా? అని అడగకపోవడం దురదృష్టకరం’ అని సమాధానం ఇచ్చాడు.

Next Story