- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహితురాలి వద్దకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్: స్నేహితురాలి వద్దకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన నాగ సత్యవతి, శ్రీను దంపతుల కుమార్తె నాగ రేవతి(20) డిగ్రీ చదువుతుంది. అయితే ఈనెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు సుచిత్రలోని ట్రెండ్స్ వద్ద స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది. అక్కడి నుంచి చింతల్‌లోని భాగ్యరది కళాశాలకు వెళ్తానంది. అయితే అదే కళాశాలలో […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: స్నేహితురాలి వద్దకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన నాగ సత్యవతి, శ్రీను దంపతుల కుమార్తె నాగ రేవతి(20) డిగ్రీ చదువుతుంది. అయితే ఈనెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు సుచిత్రలోని ట్రెండ్స్ వద్ద స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది. అక్కడి నుంచి చింతల్‌లోని భాగ్యరది కళాశాలకు వెళ్తానంది. అయితే అదే కళాశాలలో చదువుతున్న చిన్న కుమార్తె ఆరాతీయగా రాలేదని తెలిసింది. వెంటనే చిన్న కుమార్తె తల్లిదండ్రులకు తెలపడంతో చుట్టు ప్రక్కల వెతకడం ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






