ఉద్యోగులను కాపాడుకునే పనిలో పడ్డ కార్పొరేట్ సంస్థలు!

by  |
Corporate firms
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బహుళజాతి పరిశ్రమల్లో ఆట్రిషన్ రేటు(వలసల రేటు) అత్యధికంగా ఉండటంతో కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సంతృప్తిపరిచే ప్రణాళికలను అనుసరిస్తున్నాయి. దీనికోసం కార్పొరేట్ సంస్థలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల పనితీరుకు తగినట్టుగా త్రైమాసిక పరంగా ప్రమోషన్లతో పాటు ప్రత్యేక వేతన పెంపు, రీమోట్ వర్క్ పనివిధానం, ఉన్నత విద్య కోసం ప్రోత్సాహకాలతో కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రత్యేక ఆఫర్ల ధోరణి ఐటీ కంపెనీల్లో ఉందని తెలుస్తోంది.

ఉద్యోగులకు తగిన ఆఫర్లను ఇచ్చే కంపెనీల జాబితాలో కాగ్నిజెంట్, టాటా స్టీల్, మెర్సిడెస్ బెంజ్, ఆర్‌పీజీ గ్రూప్ సహా ఇతర దిగ్గజ కంపెనీలున్నాయి. ఆయా సంస్థలు నైపుణ్యం కలిగిన తమ ఉద్యోగుల కోసం, వారు సంస్థను వీడి వెళ్లకుండా ఉండేందుకు తగిన వెసులుబాట్లు, అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించిన నివేదికలో ప్రస్తుత ఏడాది భారత్‌లో 66 శాతం మంది ఉద్యోగులు ఇప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి ఇతర సంస్థలకు మారాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇంకా ఇతర ఏజెన్సీ సంస్థలు సైతం ఉద్యోగుల ఆలోచనాధోరణిని వెల్లడించాయి. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు తగిన చర్యలు చేపడుతున్నాయి.


Next Story

Most Viewed