- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. తీన్మార్ మల్లన్న మరోసారి అరెస్ట్
<p>Q News Teenmar Mallanna arrested again దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నెలరోజుల క్రితం జ్యోతిష్యుడు లక్ష్మీకాంతశర్మను డబ్బుల కోసం బెదిరించాడన్న కేసులో మల్లన్నను ఇటీవల అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ నెల 9న జయవర్ధన్ అనే కల్లు ముస్తాదారు పాదయాత్ర పేరుతో మల్లన్న తనని బెదిరించి డబ్బులు వసూలు చేశారని పోలీసులకు […]</p>

X
Q News Teenmar Mallanna arrested again
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నెలరోజుల క్రితం జ్యోతిష్యుడు లక్ష్మీకాంతశర్మను డబ్బుల కోసం బెదిరించాడన్న కేసులో మల్లన్నను ఇటీవల అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ నెల 9న జయవర్ధన్ అనే కల్లు ముస్తాదారు పాదయాత్ర పేరుతో మల్లన్న తనని బెదిరించి డబ్బులు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో A1 ఉప్పు సంతోష్‌ను 10వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా.. A5గా ఉన్న తీన్మార్ మల్లన్నను గురువారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని రాత్రి నిజామాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి తిరిగి హైదరాబాద్‌కు పంపనున్నారు.
- Tags
- Arrest
Next Story






