- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌తో పీవీ సింధు భేటీ.. రూ.30 లక్షల నజరానా అందజేత
<p>దిశ, ఏపీబ్యూరో: టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సందర్భంగా సీఎం జగన్ ఆమెను అభినందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ సింధుకు రూ.30 లక్షల నగదు నజరానాను అందజేశారు. విశాఖలో అకాడమీని త్వరలో […]</p>

దిశ, ఏపీబ్యూరో: టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సందర్భంగా సీఎం జగన్ ఆమెను అభినందించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ సింధుకు రూ.30 లక్షల నగదు నజరానాను అందజేశారు. విశాఖలో అకాడమీని త్వరలో ప్రారంభించాలని పీవీ సింధుకు సూచించారు.
రాష్ట్రం నుంచి మరింత మంది పీవీ సింధులను తయారు చేయాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పీవీ సింధు సీఎం జగన్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం ఆశీర్వాదంతో..ఆ భగవంతుడి ఆశీస్సులతో పతకం సాధించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేలా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడం అద్భుతమని కొనియాడారు. విశాఖలో వీలైనంత త్వరలోనే అకాడమీని ప్రారంభిస్తానని సింధు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులు పీవీ సింధు కుటుంబ సభ్యులు ఉన్నారు.






