ఇండోనేషియా ఓపెన్ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి

93

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లోనే వెనుదిరిగింది. ఈ టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ సెమీస్ వరకు దూసుకొచ్చిన సింధును థాయ్‌లాండ్‌కు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్ రాట్‌చనోక్ ఇంథనోన్ చెక్ పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ పీవీ సింధు 21-15, 9-21, 14-21 తేడాతో 2వ సీడ్ రాట్‌చనోక్ ఇంథనోన్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించి దూసుకెళ్లిన పీవీ సింధు.. తర్వాతి రెండు గేమ్స్‌లో చేతులెత్తేసింది. ఇంథనోన్ కొట్టిన షాట్లకు సింధు వద్ద జవాబే లేకుండా పోయింది. దీంతో సింధు వరుసగా మూడో సెమీస్‌లో కూడా ఓడిపోయింది. అంతకు ముందు ఇండోనేషియా మాస్టర్స్, అక్టోబర్‌లో ఫ్రెంచ్ఓపెన్‌లో కూడా సెమీ ఫైనల్‌లోనే వెనుదిరిగింది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్వీక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి 16-21, 18-21 తేడాతో నమి మత్సుయామా-చిహారు షిద చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టారు. దీంతో భారత షట్లర్ల ప్రయాణం ఇండోనేషియా ఓపెన్‌లో సెమీఫైనల్‌తోనే ముగిసింది.