పెళ్లి రూమర్స్‌పై పీవీ సింధు క్లారిటీ.. దానిపైనే నా దృష్టి అంటూ..

by  |
పెళ్లి రూమర్స్‌పై పీవీ సింధు క్లారిటీ.. దానిపైనే నా దృష్టి అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లిపై గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించిన పీవీ సింధు.. ఇండియాకు ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చి పెట్టింది. బ్యాడ్మింటన్‌లో ఇండియాకు ఎన్నో బంగారు పతకాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం త్వరలోనే జరగనున్న టోక్యో ఒలిపింక్స్ కోసం సాధన చేస్తోంది.

అయితే పీవీ సింధు పెళ్లి ఎప్పుడనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. పీవీ సింధు పెళ్లిపై గతంలో అనేక రూమర్స్ రాగా.. తాజాగా మళ్లీ ఆమె పెళ్లి గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తన పెళ్లిపై ఎట్టకేలకు పీవీ సింధు క్లారిటీ ఇచ్చింది. తనకు అసలు పెళ్లి ఆలోచనే లేదని, ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని వెల్లడించింది. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే ఉందని, ఒకవేళ పెళ్లి కుదిరితే అందరికీ చెప్పే చేసుకుంటానంది.


Next Story