స్టైలిష్ స్టార్ ‘పుష్ప’ టీజర్ ఆ రోజేనా?

by  |
స్టైలిష్ స్టార్ ‘పుష్ప’ టీజర్ ఆ రోజేనా?
X

దిశ, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు బన్ని. ఆగస్టు 13న పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌‌ను కంప్లీట్ చేసుకోగా, థర్డ్ షెడ్యూల్‌ షూటింగ్ ప్రస్తుతం తెన్‌కాశీలో జరుగుతోంది. కాగా ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజున విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తుండగా.. మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బన్నీకి జోడీగా క్యూట్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తుండగా ‘ఆర్య, ఆర్య2’ చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.



Next Story