ఆ రేసు నుంచి తప్పుకున్న 'పుష్ప'.. ఎప్పుడు వస్తుందంటే..?

by  |
ఆ రేసు నుంచి తప్పుకున్న పుష్ప.. ఎప్పుడు వస్తుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పుష్ప’ టీం అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇటీవలే మొదటి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది. కరోనా తర్వాత షూటింగ్ లు జరుపుకుంటున్న స్టార్ హీరోలందరు సంక్రాంతి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. పవన్- రానా రీమేక్ ‘భీమ్లా నాయక్’ , మహేష్ బాబు ‘సర్కారువారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే రేసులో బన్నీ పోటీ పడతాడనుకున్నవారికి మేకర్స్ షాక్ ఇచ్చారు. ‘పుష్ప’ పార్ట్-1 చిత్రాన్ని 2021 క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు.


Next Story

Most Viewed