అదిరిపోయే ‘పుష్ప’ ఫ్యాన్ మేడ్ పోస్టర్

by  |
అదిరిపోయే ‘పుష్ప’ ఫ్యాన్ మేడ్ పోస్టర్
X

దిశ, వెబ్ డెస్క్ :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలోని బ‌న్నీ ఫస్ట్ లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. సుక్కు, బన్నీల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రంగస్థలం సినిమాతో సుక్కు, అల వైకుంఠపురంలో మూవీతో బన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో.. రాబోయే సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ తోనే బన్నీ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి అన్నది రివీలైంది. దాంతో తమ హీరోను ఓ రేంజ్ లో మెగా అభిమానులు ఊహించుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. బన్నీ అభిమాని ‘పుష్ప’ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను రూపొందించాడు. ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూస్తుంటే చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా విడుదల చేసిన పోస్టర్ లానే కనిపిస్తుంది. అంతగా దాన్ని డిజైన్ చేశాడు.
బన్నీ, సుక్కు కాంబో అనగానే ప్రేక్షకుల్లో సహజంగానే అంచనాలుంటాయి. దానికి తగ్గట్లే సుక్కు కూడా భిన్నమైన కథాంశంతో, మాస్ ఎంటర్టైన్మెంట్ గా సినిమాను రూపొందిస్తున్నారు. బన్నీ లుక్ ను కూడా చాలా ప్రత్యేకంగా, రగ్గడ్ గా తీర్చి దిద్దారు. తాజాగా బన్నీ అభిమాని రూపొందించిన పోస్టర్ కూడా మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. బన్నీని పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లను కొట్టి .. ఆ జీప్ పైనే బన్నీ కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉన్న ఈ పోస్టర్ కూడా కథకు తగ్గట్టుగానే ఉండటం విశేషం. ఈ సినిమాలో బ‌న్నీ ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్‌గా న‌టిస్తుండ‌గా హీరోయిన్ ర‌ష్మికా మంద‌న్నా డీగ్లామ‌ర్ పాత్రలో క‌నిపించ‌నుంది. త‌మిళ స్టార్‌ విజ‌య్ సేతుప‌తి పోలీసాఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు పుష్పను 100 శాతం ఇండియాలోనే షూట్ చేయబోతోన్నారని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా ‘పుష్ప’లో నటిస్తున్నారని సమాచారం. సునీల్ శెట్టిని ప్రతినాయకుడి పాత్రకు తీసుకోనున్నట్లు సమాచారం.


Next Story