మదనపల్లి జంట హత్యకేసులో సంచలన విషయాలు బయటపెట్టిన.. పురుషోత్తం, పద్మజ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్ : మదనపల్లి జంట హత్యకేసు ఓ సంచలనం సృష్టించిన విషయం విదితమే. మూఢనమ్మకాల మాయలో పడి కన్న కూతుర్లనే హతమార్చారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేస్తూ అందరిని భయబ్రాంతులకు గురిచేసింది పద్మజ. ఆమె దెబ్బకు మహిళా ఖైదీలు ఆఫిసర్లు సైతం వణికిపోయారు. అయితే తాజాగా పురుషోత్తంనాయుడు, పద్మజలను విశాఖ మానసిక వైద్యశాల నుంచి శుక్రవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా [&hellip;]</p>

మదనపల్లి జంట హత్యకేసులో సంచలన విషయాలు బయటపెట్టిన.. పురుషోత్తం, పద్మజ
X

దిశ, వెబ్ డెస్క్ : మదనపల్లి జంట హత్యకేసు ఓ సంచలనం సృష్టించిన విషయం విదితమే. మూఢనమ్మకాల మాయలో పడి కన్న కూతుర్లనే హతమార్చారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేస్తూ అందరిని భయబ్రాంతులకు గురిచేసింది పద్మజ. ఆమె దెబ్బకు మహిళా ఖైదీలు ఆఫిసర్లు సైతం వణికిపోయారు. అయితే తాజాగా పురుషోత్తంనాయుడు, పద్మజలను విశాఖ మానసిక వైద్యశాల నుంచి శుక్రవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా వైద్యాధికారులు తెలిపారు. మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన దంపతులు కోలుకున్నారని, కన్న కూతుళ్ల హత్య కేసులో ఆ తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. ఇద్దర్ని మదనపల్లి సబ్ జైలు సిబ్బందికి అప్పగిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

Next Story