పర్‌ఫెక్ట్ స్నాప్స్ బై స్మార్ట్ క్యాట్!

by  |
పర్‌ఫెక్ట్ స్నాప్స్ బై స్మార్ట్ క్యాట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవలే మలేషియాలో ఓ కోతి.. ఒకరి ఫోన్ ఎత్తుకెళ్లి, అందంగా సెల్ఫీలు తీసుకున్న విషయం తెలిసిందే. సాంకేతికత మనిషిని మార్చేసినట్లు.. జంతువులను కూడా అప్‌డేట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ స్మార్ట్‌ వరల్డ్‌లో.. ఏ వేడుకైనా లేదా ఏ నలుగురు కలిసినా సెల్ఫీ క్లిక్‌మనకుండా ఉండదు. అంతగా సెల్ఫీలకు అలవాటు పడ్డాం. ఇక పెట్ యానిమల్స్ కూడా మనం చేసే పనులను అబ్జర్వ్ చేస్తున్నాయో ఏమో కానీ.. అవి కూడా సెల్ఫీలకు పోజులిచ్చేస్తున్నాయ్. అంతేకాదు వాటికవే సెల్ఫీలు తీసుకుంటున్నాయి. తాజాగా చైనాలోని ఓ పెంపుడు పిల్లి సెల్ఫీలు తీసుకుంటూ ఔరా అనిపించింది.

బీజింగ్‌లో ఓ మహిళ.. ఎంతో ఇష్టంగా ఓ పిల్లిని పెంచుకుంటోంది. దాన్ని ముద్దుగా ‘ఎర్ న్యూ’ అని పిలుచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన ఐపాడ్‌ను టేబుల్ మీద పెట్టి, ఇంట్లో ఏదో పనిలో నిమగ్నమైంది. అంతలోనే ఆ పిల్లి.. ఐపాడ్‌ను తీసుకుని సెల్ఫీలకు పోజులిచ్చేసింది. ఫ్లాష్‌ లైట్ కూడా ఉపయోగించి పదుల సంఖ్యలో ఫొటోలు దిగింది. ఆ తర్వాత ట్యాబ్ ఓపెన్ చేసిన యజమాని.. అందులో పిల్లి ఫొటోలు చూసి ఆశ్చర్యపోయింది. సెల్ఫీలు తీసుకున్న తన బుజ్జి పిల్లిని చూసి తెగ మురిసిపోయింది. సదరు ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఇక ఆ ఫొటోలను చూసిన పెట్ లవర్స్, నెటిజన్లు.. ఆ స్మార్ట్ పిల్లి చేష్టలకు తెగ కామెంట్లు పెట్టేశారు. ఇది ఈతరం క్యాట్ అని, బెస్ట్ సెల్ఫీ కాంటెస్ట్‌లో దీనికి అవార్డు ఇవ్వాలని, స్మార్ట్ క్యాట్ విత్ స్మార్ట్ ఫొటోస్ అంటూ ఆ పెంపుడు పిల్లిని తెగ పొగిడారు. దీంతో క్యాట్ సెల్ఫీలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed