గుంటూరు ఎంపీపై దాడికి యత్నం..

8

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్‌పై మందడం గ్రామానికి చెందిన పూర్ణచందర్ రావు దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పూర్ణచందర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఎంపీ మీద దాడికి యత్నించడానికి గల కారణాలు ఇంకా వెలువడలేదు.